మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్‌ ఫీజు వసూళ్లపై వెనక్కి తగ్గిన ఎల్‌అండ్‌టీ

-

హైదరాబాద్ నగరంలో మెట్రో రైలులో ప్రయాణించే వారికి ఎల్అండ్టీ, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ(హెచ్ఎంఆర్ఎల్) ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఇటీవల వాహనాలతో వచ్చి మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేసి వెళ్లాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందేనని ప్రకటించిన ఈ సంస్థ పార్కింగ్‌ ఫీజు వసూళ్లపై వెనక్కి తగ్గింది. ముఖ్యంగా నాగోల్, మియాపూర్ స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, నిరసనల మేరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

ఇక నగరంలో మొత్తం 3 కారిడార్లలో 50 స్టేషన్లు ఉండగా 40 స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంది. అందులో చాలా స్టేషన్లలో ఇప్పటికే పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తుండగా నాగోల్ నుంచి మియాపూర్ కారిడార్లో చివరి స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఇటీవల ఈ రెండు చివరి స్టేషన్లలో కూడా ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని ఎత్తివేస్తూ డబ్బులు వసూలు చేయడం పట్ల ప్రయాణికులు ఆందోళనకు దిగారు. టికెట్ ధరలు పెంచడంతో పాటు పార్కింగ్ ఫీజుతో వసూళ్లకు పాల్పడటం అన్యాయమంటూ ఎల్అండ్టీ తీరుపై మండిపడటంతో తాజాగా తన నిర్ణయంపై ఎల్అండ్టీ వెనక్కి తగ్గింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version