నూతన సచివాలయం ప్రారంభం.. 6 ఫైల్స్ పై కేసీఆర్ సంతకం

-

తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. తొలుత హోమశాల వద్ద యాగ పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం.. ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని సచివాలయాన్ని ప్రారంభించారు. తూర్పు గేట్ నుండి లోపలికి వెళ్లిన కేసీఆర్ గేటు దగ్గరదిగి యాగశాల వరకు నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఇక వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్.

మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కి పాదాభివందనం చేశారు. ఆ తర్వాత ఆరవ అంతస్తులోని తన చాంబర్ కి చేరుకొని ముఖ్యమైన ఫైల్ పై సంతకం చేసి పరిపాలనను ప్రారంభించారు. కేసీఆర్ పోడు భూముల పంపిణీ పై తొలి సంతకం చేశారు. స్పీకర్ పోచారం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ కి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా సీఎం తన కార్యాలయంలో మొత్తం 6 ఫైల్స్ పై సంతకాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version