బోడి రైతుబంధు ఎవడు అడిగాడు – వైఎస్ షర్మిల

-

నేడు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొణిజర్ల మండలంలో అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. అకాల వర్షాల వల్ల సర్వం కోల్పోయామని షర్మిలకు వివరించారు రైతులు. అయితే మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు షర్మిల. పొలంలోనే కింద పడిపోయారు.

ఆ తరువాత షర్మిల మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షానికి ఖమ్మం రైతులు దారుణంగా నష్టపోయారని తెలిపారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన మొక్క జొన్న పంట నేల పాలయ్యిందని.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. గత నెల ఇదే ఖమ్మం జిల్లాకి కేసీఅర్ వచ్చాడని.. మొక్క జొన్న పంటను పరిశీలించి 10 వేలు ఇస్తా అని ప్రకటన చేసి.. గాలి మోటార్లో వచ్చి గాలి మాటలు చెప్పాడని మండిపడ్డారు. రైతులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల.

పెద్ద పెద్ద భవంతులు కట్టేందుకు డబ్బులు ఉంటాయి కానీ.. పంట నష్టపోయిన రైతులకు ఇవ్వడానికి రూపాయి కూడా ఉండదని దుయ్యబట్టారు. 2.50 లక్షల ఎకరాలు అని చెప్పి ఇప్పుడు లక్షా 50 వేల ఎకరాలు అన్నారని.. కనీసం అది కూడా ఇవ్వలేదని అన్నారు. బోడి 5 వేలు రైతు బందు ఎవడు అడిగాడని అన్నారు షర్మిల. 30 నుంచి 50 వేలు పెట్టుబడి పెట్టిన రైతులు నష్టపోయారని.. వారికి 5 వేలు ఏ మూలకు సరిపోతాయన్నారు. ఇదేనా కేసీఅర్ పాలన అని నిలదీశారు షర్మిల. రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version