ఇన్ కమ్ ఫై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. మంత్రులు, అధికారులతో కీలక భేటీ..!

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఇవాళ వివిధ శాఖల ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. భేటీకి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు ఆయా శాఖల ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలపై సీఎం అధికారులతో చర్చించారు. కమర్షియల్ ట్యాక్స్, రవాణా, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, మైనింగ్ శాఖల్లో ఆదాయ సేకరణ వివరాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. పంద్రాగస్టులోగా రుణమాఫీతోపాటు పింఛన్ల పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతుబంధు వంటి పథకాలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన నిధుల సర్దుబాటు విషయంలో రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy is a good news for Telangana lawyers

హైదరాబాద్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో మాట్లాడిన సీఎం ప్రజలకు ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version