Indigo flight makes emergency landing at Shamshabad International Airport : శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం చోటు చేసుకుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ముంబాయి నుండి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి, వెంటనే హైదరాబాద్ ATC నుండి అనుమతి తీసుకున్నారు పైలట్.
దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా విమానాన్ని ల్యాండ్ చేశారు పైలెట్. దీంతో విమానంలోని 144 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయిన దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక లోపాన్ని విశ్లేసిస్తున్నారు.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
ముంబాయి నుండి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి, వెంటనే హైదరాబాద్ ATC నుండి అనుమతి తీసుకున్న పైలట్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా విమానాన్ని ల్యాండ్ చేసిన పైలెట్.
ఊపిరి… pic.twitter.com/BeBfE4uRrc
— Telugu Scribe (@TeluguScribe) January 4, 2025