తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

-

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని బీఎస్పీ సంకల్ప సభ లో పాల్గొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బీమా లేక రైతులు చస్తుంటే.. ఢిల్లీలో ఉన్న కేసీఆర్ చోద్యం చూస్తూ ఉన్నాడు అంటూ మండిపడ్డారు. ఇర్విన్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు పేదల భూములు సుమారు 1100 ఎకరాల్లో ప్రాజెక్ట్ కొరకు కాలువలు తీసి వారిని రోడ్డుపై పడేశారన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ధరణి పోర్టల్ తెచ్చి పేదల భూములను లాక్కున్నారని మండిపడ్డారు.

సీఎంవో లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎందుకు లేరని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీసీలకు తెలంగాణలో అన్యాయం చేశారని, మేము అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం చేస్తామన్నారు. తెలంగాణలో బహుజనులు దుఃఖం లో ఉన్నారని, కాలేశ్వరం ప్రాజెక్టు లో ఒక్కరైనా బహుజన కాంట్రాక్టర్ ఉన్నాడా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఎస్పిని అధికారంలోకి తీసుకొస్తామని, అందుకే నేను తెలంగాణలో రాజ్యాధికార యాత్ర చేస్తున్నానని, ప్రగతి భవన్ పై బీఎస్పీ జెండా ఎగర వేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version