విమానం టేకాఫ్ , ల్యాండింగ్ సమయంలో ఫైట్ లైట్లు ఎందుకు డిమ్ అవుతాయో తెలుసా.?

-

విమాన ప్రయాణం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అదేదో సినిమాలో అన్నట్లు విమానం ఎక్కాలంటే అదృష్టం ఉండాలి అంటే..దిగాలంటే కూడా అదృష్టం ఉండాలి అని..నిజానికి అదే కరెక్టే. సమాయానికి ఆదా చేసేకునేందుకు చాలామంది విమాన ప్రయాణాన్ని సెలక్ట్ చేసుకుంటారు. విమానంలో ఉండే కొన్నింటిని మీరెప్పుడైనా గమనించారా.. ఉదాహరణకు విమానంలో స్మోకింగ్ చేయటం నిషేధం. కానీ యాష్ ట్రేలు పెడతారు. ఎందుకంటే.. దాంట్లో యాష్ తో పాటు..ఏదైనా స్క్రాప్ కూడా అందులోనే వేస్తారట. అలానే విమానం టేకాఫ్‌ అయినప్పుడు లైట్స్‌ డిమ్‌ అవడాన్ని మీరు గమనించి ఉంటారు. అయితే ఫ్లైట్‌ టేకాఫ్‌ , ల్యాండింగ్‌ సమయంలో లైట్లు ఎందుకు డిమ్‌ అవుతాయి అని మీరు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా?

విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో లైట్లు డిమ్‌ చేస్తారు.. ఎందుకంటే మన కళ్లు కాంతికి అనుగుణంగా ఇలా చేస్తారు. కళ్లకు ఎఫెక్ట్‌ కాకుండా లైట్లను డిమ్‌ చేస్తారు. కాంతి నుంచి చీకటికి లేదా చీకటి నుంచి కాంతికి సర్దుబాటు కావడానికి మన కళ్లు 10 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. కానీ కాంతి మసకబారితే కళ్లకు కాంతిని సర్దుబాటు చేసేందుకు తక్కువ సమయం పడుతుంది. అందుకే లైటింగ్ తగ్గిస్తారు.

అయితే టేకాఫ్‌ లేదా ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదాలు జరగటం మనం చాలాసార్లు చూసే ఉంటాం. అందుకే విమానాల్లో ఎమర్జెన్సీ డోర్లు, ఎగ్జిట్‌ లైటింగ్‌ సులువుగా కనిపించేలా ముందుగానే లైట్లను డిమ్‌ చేస్తారు. 2006, 2017 మధ్య బోయింగ్‌ ఎయిర్‌లైన్‌ అనుభవ వివరాల ప్రకారం.. టేకాఫ్‌ అయిన మొదటి 3 నిమిషాల్లోనే 13 శాతం ప్రమాదాలు జరిగాయట. ల్యాండింగ్‌కు 8 నిమిషాల ముందు 48 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి.

టేకాఫ్ లోనే కాదు..విమానం ప్రయాణ సమయంలోనూ చాలా ప్రమాదాలు జరుగుతాయి..తాజాగా సముద్రంలో బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-35బి లైటెనింగ్ యుద్ధ విమానం కూలిపోయింది. అయితే పైలెట్ ముందే బయటపడ్డాడు. తన సీటుకున్న ఎజెక్ట్ బటన్ నొక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రమాదానికి గురైన ఆ యుద్ధ విమానం సముద్రం అడుగుభాగానికి చేరింది. ఈ యుద్ధ విమానం కోసం బ్రిటీష్ నేవీ ఆగమేఘాలపై సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అత్యాధునిక మినియేచర్ జలాంతర్గాములను, ప్రత్యేక బలగాలను, డైవర్లను రంగంలోకి దించింది.

ఎఫ్-35కి హైపెర్ఫార్మెన్స్ విమానంగా ఎంతో పేరుంది. ఇది ప్రమాదాలకు గురికావడం చాలా అరుదు. మధ్యధరా సముద్రంలో నిలిపివుంచిన బ్రిటన్ విమాన వాహక నౌక హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ పై నుంచి టేకాఫ్ తీసుకున్న తర్వాత అనూహ్యరీతిలో కుప్పకూలింది. ఈ ప్రమాదం వెనుక శత్రు హస్తం లేదని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పైలెట్ కు స్వల్పగాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రమాదంపై విచారణ జరుగుతోంది.విమానం ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో అంత అప్రమత్తతో ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version