Medak: కాలేజీకి వెళ్లమన్నారని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా పొడ్చన్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాలేజీకి వెళ్లమన్నందుకు ఇంటర్ విద్యార్థిని సింధూజ ఆత్మహత్య చేసుకుంది. నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్న సింధూజను కళాశాలకు వెళ్లాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారట.
అయితే.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది ఇంటర్ విద్యార్థిని సింధూజ. ఇక ఇంటర్ విద్యార్థిని సింధూజ మరణంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిజంగానే… కాలేజీకి వెళ్లమన్నారని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా… లేక ప్రేమ కథ వెనుక ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కాలేజీకి వెళ్లమన్నారని ఇంటర్ విద్యార్థిని సింధూజ ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.