మేడిగడ్డపై విచారణ.. హైకోర్టు సీజేకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

-

తెలంగాణ హైకోర్టు సీజేకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డపై జ్యుడిషియల్‌ ఎంక్వైరీకి సిట్టింగ్‌ జడ్డిని కేటాయించాలని రేవంత్ సర్కార్ లేఖలో కోరింది. మేడిగడ్డపై విజిలెన్స్‌ విచారణలో రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌, సీఏ పేర్లు ఉన్నట్లు తెలిపింది. జ్యుడిషియల్‌ విచారణ, విజిలెన్స్‌ విచారణలో ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు..? ఏం చేశారు..? కాంట్రాక్టు ఎలా ఫైనల్‌ అయ్యింది..? అనే అంశాలపై విచారణ చేయాలని విజిలెన్స్‌, జ్యుడిషియల్‌ ఎంక్వైరీలో తెలంగాణ ప్రభుత్వం చేర్చింది.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈ చర్యలు చేపట్టింది. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్ళారు. ఈఎన్సీ మురళీధర రావు ఆఫీస్‌లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆఫీసులోని రెండు, నాలుగు అంతస్థుల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో పది ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. 12 బృందాలతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. మహాదేవపూర్‌లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version