ఇందిరమ్మ రాజ్యమంటే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడమా..? కేటీఆర్

-

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హూజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం? అన్నారు. ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా? అని ప్రశ్నించారు కేటీఆర్.

ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవటమేనా..? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడే..  దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కేటీఆర్. ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు తాము బెదరమని.. ఇంతకు మించిన ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు మాజీ మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version