ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో ఉప ఎన్నికలు రావు : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

-

ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో ఉప ఎన్నికలు రావు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఖర్గే ఆశీర్వాదం కోసం ఢిల్లీ  వచ్చి కలిశాను. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మహా నేత ఖర్గే. అన్ని వర్గాలను కలుపుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అట్టడుగున ఉన్న కార్యకర్త నుంచి అన్ని స్థాయిల్లో బలోపేతం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చేలా పని చేస్తామన్నారు.

 

రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తాం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి, పార్టీ పెద్దల చేతిలో ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడు మారిన ప్రతిసారి కొత్త కమిటీలు ఏర్పడతాయి. కొత్త కమిటీల విషయంలో ఏఐసిసి పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. పార్టీ ఫిరాయించిన అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే.. న్యాయ ప్రత్యామ్నాయాలు చూస్తాం. మా పార్టీ విధానాలు, పాలన చూసి కొందరు నేతలు వస్తే చేర్చుకున్నాం. ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో ఆ పార్టీ నేతలు లేరు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం లో ఉప ఎన్నికలు వస్తాయని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఎన్నికలు జరిగినా, అది మా ఖాతాలోనే పడతాయని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version