ఆరు నెలల్లో రాష్ట్రం లో వచ్చిన మార్పు ఇదేనా.. ఏనుగుల రాకేష్ రెడ్డి సెటైర్లు..!

-

తెలంగాణ లో ఎన్నికల ముందు రాష్ట్రంలో మార్పు కావాలంటే..  కాంగ్రెస్ రావాలంటూ ఆ పార్టీ చేసిన ప్రచారంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని రంగాల్లో ప్రభుత్వం ప్రజలను పీడిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తెలిపారు. ఆరు నెలల పాలనలో ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు, గురుకుల టీచర్లు, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఆశావాహులు, నిరుద్యోగ యువత, జీవో 46 బాధితులు, డీఎస్సీ ఆశావహులు అంతా రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటూ సెటైర్లు వేశారు.

మరోవైపు గురుకుల టీచర్లు నియామక పత్రాలు ఇచ్చి వారికి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం వారి జీవితాలతో ఆటలు ఆడుతుందని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సీఎంతో సహా మంత్రులు కూడా రొడ్డెక్కే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నిరుద్యోగులను ఆదుకుని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఏనుగు  రాకేష్ రెడ్డి డిమాంబ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version