మేడ్చల్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఓ బంగారం దుకాణం యజమాని శేషారంపై కత్తితో దాడిచేసి చోరీకి పాల్పడ్డారు దుండగులు. పట్టపగలే దుకాణంలోకి చొరబడిన దుండగులు . యజమానిని కత్తితో పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఇద్దరిలో ఒకరు హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి బుర్ఖా ధరించి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దొంగల దాడిలో గాయపడ్డ శేషారామ్‌ను అతడి కుటుంబ సభ్యులు. ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సందర్భంగా షాపు యజమాని మాట్లాడుతూ షాపులోకి చొరబడ్డ వెంటనే తనపై కత్తితో దాడికి పాల్పడ్డారని తెలిపారు. తనతో పాటు తన కుమారుడు ఉన్నాడని, దొంగలను చ ూడగానే తాను వెంటనే భయపడి పక్కనే ఉన్న గదిలోకి పారిపోయాడని తెలిపారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోగానే తనను పొడిచి నగదుతో పరారయ్యారని షాపు యజమాని చెప్పారు.
సీసీటీవీ ఫుటేజ్.. బుర్కా వేసుకొచ్చి బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన దుండగులు
హైదరాబాద్ – మేడ్చల్ పట్టణంలోని
జగదాంబ బంగారం షాపుకు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చి.. కత్తితో షాపు యజమాని మెడ కింద పొడిచి బంగారం ఎత్తుకెళ్లారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల… pic.twitter.com/I8Hj80ntFZ
— Telugu Scribe (@TeluguScribe) June 20, 2024