కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి మాట్లాడకపోవటమే మంచిది అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి కోమటి రెడ్డి గురించి ఎందుకు మాట్లాడకపోవడం మంచిది అంటే.. ఆయన మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్ ఏమైనా కనిపించిందా? హరీష్ రావు మాట్లాడింది కావొచ్చు, కేటీఆర్ మాట్లాడింది కావొచ్చు, నేను మాట్లాడింది కావొచ్చు.. సబ్జెక్ట్ కాకుండా వేరే ఏమైనా బూతు పదమో, ఇంకేదైనా మాట్లాడామా అని ప్రశ్నించారు. ఇవాళ వెంకట్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ప్రజలకు ఉపయోగపడే విషయం ఏమైనా ఉందా? సమస్యను పక్కదారి పట్టించడం కోసం చిల్లర చేష్టలు చేస్తున్నారు.. మేము దాంట్లోకి పోదలుచుకోలేదు అన్నారు.
సమస్యను పక్కదారి పట్టించడం కొరకు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు జగదీశ్ రెడ్డి. వెంకట్ రెడ్డి మాట్లాడిన వ్యక్తిగత దూషణలకు సంబంధించి వేరే పద్దతుల్లో.. దానికి ఏ పద్దతుల్లో ఆయనకు సమాధానం తీసుకోవాలో నేను తీసుకుంటా. ఇప్పటివరకు వదిలేశా. మంచి భాషతోనైనా.. బూత్ బాషతోనైనా వెంకట్ రెడ్డి నాతో తట్టుకోలేడని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచే సమాధానం వచ్చేటట్టు చేస్తానని తెలిపారు జగదీశ్ రెడ్డి.