హైదరాబాద్ లోని మియాపూర్ లో చిరుత కలకలం రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జన వాసాల మధ్యలోకి చిరుత వచ్చినట్లు ప్రచారం జరగడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలోనే చిరుత సంచరించిందని.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలోనే చిరుత తిరుగుతున్న వీడియోను… ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ వీడియో వాస్తవమేనని అందరూ భయపడుతున్నారు.
ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీని గురించి వార్తలు వచ్చాయి. నిజంగానే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత సంచరించిందా..? లేదా అనేది ఫారెస్ట్ అధికారులు తేల్చేశారు. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో కనిపించిన జీవి చిరుత కాదని.. అడవి పిల్లి అని అటవీ అధికారులు తేల్చేశారు. చిరుత అని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అటవీ అధికారులు కదలికలను బట్టి అడవి పిల్లిగా తేల్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.