హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 4లోని టాస్ పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా యువతులతో పబ్ లలో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తుండగా.. పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పబ్ కి కస్టమర్లను ఆకర్షించేందుకు 42 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన డ్యాన్స్ చేయిస్తున్నారని వెల్లడించారు పోలీసులు. అశ్లీలంగా డ్యాన్స్ లు చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు.
ఈ ఘటన పై బంజారాహిల్స్ పోలీసులు పబ్ పై కేసు నమోదు చేశారు. దాడి చేసిన సమయంలో పబ్ లో మొత్తం 100 మంది పురుషులను.. 42 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.పబ్ నిర్వాహకులు ఈ యువతులను పబ్ కు వచ్చే కస్టమర్లకు ఎరగా వేస్తున్నారు. కస్టమర్లతో చనువుగా ఉంటూ డ్యాన్స్ లు వేస్తూ.. వారితో పాటే మద్యం సేవిస్తున్నట్టు నటిస్తారు. కానీ వాళ్లు తాగేది మాత్రం కూల్ డ్రింక్స్. కానీ కస్టమర్లతో మద్యం తాగుతున్నట్టు నమ్మిస్తారు. చివరిగా వారి బిల్లులోనే యువతులు తాగిన బిల్లును కలిపి కస్టమర్ల జేబులకు చిల్లు పెడుతున్నారని వెలుగులోకి వచ్చింది.