రేవంత్ పక్కా.. మోడీ మనిషే – జగదీశ్వర్‌ రెడ్డి

-

రేవంత్ పక్కా.. మోడీ మనిషే అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ…. మోదీని కలసి వచ్చాక.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త ట్రెండ్ మెదలు పెట్టారని తెలిపారు. రేవంత్ రెడ్డి.. మోదీ ఏజంట్ గా మాట్లాడుతున్నారు. రేవంత్ పక్కా మోదీ మనిషే అంటూ బాంబ్‌ పేల్చారు. మోదీని కలసొచ్చాక.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై రేవంత్ దాడి తీవ్రతరం చేశాడని చురలకు అంటించారు.

jagadeesh reddy

కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పంచాయితీ .. మోదీ ఏ – టీం, మోదీ బీ-టీం మాదిరి ఉందన్నారు. రేవంత్ రెడ్డి.. మోదీతో రహస్య ఒప్పందం చేసుకుని వచ్చాడని వెల్లడించారు. రాహుల్ గాంధీకి అర్థం అవుతుందో లేదో తెలియదని ఎద్దేవా చేశారు. మోదీ తెలంగాణకు నిధులు ఇస్తానంటే.. కిషన్ రెడ్డి ఆపితే ఆగుతదా ? మోదీ భజన చేస్తూ.. రేవంత్ బహిరంగంగా దొరికిపోతున్నాడన్నారు. పదవి, ఆస్తులు కాపాడుకోవటానికే రేవంత్ మోదీ భజన చేస్తున్నాడని ఆగ్రహించారు. హరీష్ రావుపై సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news