BREAKING : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు నో టికెట్‌ !

-

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారా.. అంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు దారి తీశాయి. ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగిత్యాల జిల్లా కేంద్రం లో 10 వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం జగిత్యాల లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో తెలియదు కానీ నేను లేకున్నా వారిని గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఎన్నికల సమయం కాదని.. ఎమ్మెల్యే అయిన తర్వాత జగిత్యాలను ఎంతో అభివృద్ధి పరిచానని వెల్లడించారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. కానీ నేను పోటీ చేయకపోయినా.. బీఆర్ఎస్‌ పార్టీనే గెలిపించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version