ఎన్నికల్లో పోటీకి దూరంగా జన సమితి..కాంగ్రెస్‌ కు మద్దతు

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకుంది జన సమితి పార్టీ. కాంగ్రెస్‌ కు మద్దతు ఇస్తూ..ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనుంది జన సమితి పార్టీ. ఇవాళ టీజేఎస్ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం తో సమావేశమయ్యారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, నాయకులు బోసు రాజు, వేం నరేందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

kodanram

ఈ సందర్భంగా జన సమితి పార్టీ చీఫ్‌ కోదండరాం కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి ఓకే చెప్పారు కోదండరాం. అంతేకాదు..ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా జన సమితి ఉంటుందని చెప్పారు కోదండరాం. సీఎం కేసీఆర్ ను గద్దె దించడానికి కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది జన సమితి. విశాల ప్రయోజనాల దృష్ట్యా పోటీకి దూరంగా జన సమితి ఉంటుందని కోదండరాం అన్నారు. మా ఆలోచనలు.. భవిష్యత్ కర్తవ్యాలు చర్చ చేశామని..సీఎం కేసీఆర్ 9 ఏండ్లలో నిర్మించిన రాజ్యాంగ వ్యతిరేక పాలనను కూల్చుతామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version