నిజామాబాద్ లో టఫ్ ఫైట్ ఉందని… ఎవరైనా గెలవొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. ఇవాళ మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ… నాకు రాజకీయ జన్మను ఇచ్చింది జగిత్యాల ప్రజలు అని… జగిత్యాల ప్రజల తీర్పును గౌరవిస్తానని తెలిపారు. రాజకీయాలలో అలసి పోయా, ఎక్కడ పోటీ చేయను అని తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి.
మోడీ ప్రధాని హోదాలో ఉండి మత విద్వేషాలను రెచ్చగొడు తున్నారు…స్వార్ధ రాజకీయాలకోసం మీరు దేశాన్ని ఎటు వైపు తీసుకపోవాలని అనుకుంటున్నారు అని మోడీపై ఆగ్రహించారు. RTC బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మోడీ తప్పు పడుతున్నారు…మహిళల పట్ల మోడీకి ఉన్న వివక్షత అర్ధమౌతుందని విమర్శలు చేశారు. మోడీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ద్వంద వైఖరి ని అవలంబిస్తున్నాడు…దేశంలో బుల్ డోజర్ కల్చర్ ను తెచ్చింది బీజేపీ పార్టీ,కాంగ్రెస్ కాదన్నారు.
ఫైజాబాద్ కోర్ట్ తీర్పు ను గౌరవించి 1989 లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అని… అయోధ్య రామ్ లాల్లో గేట్లు తెరిచాడన్నారు. రామ మందిరం అంకురార్పణ రాజీవ్ గాంధీ ప్రధాని గా ఉన్నప్పుడు జరిగింది…. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లో కాంగ్రెస్ విఫలమైందని వెల్లడించారు. రామ మందిర్ నిర్మాణ జాప్యానికి బీజేపీనే కారణమని ఫైర్ అయ్యారు.