క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలకు ఇవాళ చర్లపల్లి సెంట్రల్ జైలులో జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్ల ల్లో 213 మంది క్షమాభిక్షకు ఎంపిక అయ్యారు. క్షమాభిక్ష పై విడుదలయ్యే ఖైదీలకు జాబ్ మేళా ద్వారా ఉపాధి కల్పించనున్నారు జైళ్ల శాఖ అధికారులు.ఆసక్తి, అర్హత మేరకు విడుదల కానున్న ఖైదీలకు ఉపాధి కల్పించనున్నారు జైలు అధికారులు.
ప్రధానంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకులతోపాటు డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర విభాగాల్లో వారి ఆసక్తి మేరకు ఖైదీలకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. అవసరమైన వారికి అర్హతను బట్టి పలు ప్రైవేటు సంస్థల్లో కూడా ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఖైదీల విడుదలకు ఆమోదముద్ర వేసారు రాష్ట్ర గవర్నర్. చర్లపల్లి జైలులో జరిగిన జాబ్ మేళా కార్యక్రమానికి ఐజి వై రాజేష్, డిఐజి మురళి బాబు, జైల్ శాఖ అధికారులు హాజరయ్యారు.