తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల హడావిడి జోరందుకుంటుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో.. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, బీఎస్పీ వంటి పార్టీలు ప్రచారాన్ని జోరుగా చేస్తున్నాయి. నవంబర్ 30న ఎన్నికలు ఉండడంతో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తుంటే.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కెసిఆర్ బహిరంగ సభల్లో వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడంపై పలు రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి.
ఈ నేపథ్యంలోనే ఓటర్లు అప్రమత్తంగా ఉండి ఓటర్ లిస్టులో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సూచించారు. ఓటర్ ఐడి కార్డు ఉన్నంత మాత్రాన మీ ఓటు ఉన్నది అని భావించొద్దని.. జాబితాలో మీ పేరుని ఒకసారి రీ చెక్ చేసుకోవాలని సూచించారు. హైకోర్టులో స్వీట్ ఆక్టివిటీ కింద ఏర్పాటు చేసిన పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా పలువురు హైకోర్టు జడ్జిలు న్యాయవాదులు సిబ్బందితో మాట్లాడి ఓటరు జాబితాలో తమ పేరు ఎలా చెక్ చేసుకోవాలో అవగాహన కల్పించారు. Https://voters.eci.gov.in లేదా voter help line ద్వారా ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు అని తెలిపారు. మరేదైనా ఇతర సందేహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1950 కి సంప్రదించాలని ఎన్నికల అధికారి సూచించారు.