బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ అన్యాయం చేయలేదు కానీ ఓడిపోయే పార్టీ నుండి పోటీ నా కూతురిని పోటీ పెట్టడం ఎందుకని పార్టీ మారాను అంటూ పేర్కొన్నారు కడియం శ్రీహరి. వివిధ కారణాలతో ప్రజలు బీఆర్ఎస్ కు దూరమవుతున్నారని, కాంగ్రెస్‌లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని బీఆర్ఎస్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.
కడియం కుమార్తె, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కావ్య పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించగా.. శ్రీహరి కూడా పార్టీని వీడుతున్నట్టు స్పష్టమైంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నేతలు కడియంతో భేటీ అయి పార్టీలోకి కూడా ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని కడియం చెప్పారు.