కే. కేశవ రావు ఇంటికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..వెళ్లిన సమయంలో 3 సార్లు పవర్ కట్ అయింది. కె.కేశవరావును బంజారాహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి కలిసారు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కె.కేశవరావును మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, అనిల్ యాదవ్, జానారెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, ఇతర నేతలు కలిసారు.
అయితే.. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన కొద్ది గంటలకే కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఆహ్వానించడానికి కే. కేశవ రావు ఇంటికి వెళ్ళగా ఆ సమయంలో 3 సార్లు కరెంటు పోయింది. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.
ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. డిమాండ్ కు సరిపడేంత విద్యుత్తు అందుబాటులో ఉందని, కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.