Kakatiya Kalathoranam, Rajamudra without Charminar: తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ మరో వివాదం చిక్కుకున్నారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేకుండా రాజముద్ర కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వదిలినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేకుండా రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రభుత్వం అధికారులు.
అంతేకాదు… వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో సోమవారం ఎల్ఆర్ఎస్ పై హెల్ప్ డెస్క్ బ్యానర్ ఏర్పాటు చేశారట అధికారులు. అయితే ఆ ఫ్లెక్సీలో తెలంగాణ రాజముద్ర మార్చేశారు అధికారులు. అధికారిక రాజముద్ర కాకుండా కొత్తగా చేసి పెట్టారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి రాజముద్ర కొత్తది ఇంకా విడుదల చేయలేదు రేవంత్ రెడ్డి సర్కార్. రాజముద్ర ను మార్చుతామని మాత్రమే ప్రకటించింది. కానీ అంతలోనే రాజముద్ర ను మార్చేశారు అధికారులు.