తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దగ్గర నుంచి బిఆర్ఎస్ తెలంగాణలో తనదైన ముద్ర వేసింది. ఇప్పటివరకు బిఆర్ఎస్ రెండుసార్లు గెలిచి అధికారం చేపట్టింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేశాయి. ఈ తరుణం లోనే మంత్రి కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిపక్ష పార్టీల మాటలకు తూటాల వంటి సమాధానాలు ఇచ్చి మారు మాట్లాడకుండా చేయగల సమర్థులైన ఈ బావాబామ్మర్దులు..పార్టీ హ్యాట్రిక్ కోసం కష్టపడుతున్నారు. ఈ తరుణం లోనే మెదక్ జిల్లా రాజకీయాల్లో మంత్రి హరీష్ రావు చక్రం తిప్పారు.
బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు వివేకానంద నగర్లోని కంఠా రెడ్డి తిరుపతి రెడ్డి ఇంటికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ లు నవీన్ కుమార్, శంబిపూర్ రాజు, సునీత లక్ష్మారెడ్డి వెళ్లారు. మైనంపల్లి చేరికతో కాంగ్రెస్ పార్టీలో వరుసగా రాజీనామాలు కొనసాగుతున్నారు. దీంతో బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు వివేకానంద నగర్లోని కంఠా రెడ్డి తిరుపతి రెడ్డి ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్లారు. బిఆర్ఎస్ లో చేరేందుకు కంఠా రెడ్డి తిరుపతి రెడ్డి సిద్దం అయ్యారు. ఇప్పటికే మేడ్చల్ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.