BREAKING : లిక్కర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈడీ నోటీసులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ తరుణంలోనే.. నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరుగనుంది.
ఈ లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు కవిత. తనపై ఎలాంటి బలవంతపు చర్యలూ ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. గతంలో దాఖలు చేసిన పిటిషన్ లో IA ఫైల్ చేసిన కల్వకుంట్ల కవిత..ఇప్పుడు ఈడీ నోటీసులను సవాల్ చేసింది. దీంతో ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారించనుంది జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం. మరి ఈ విషయంపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.