నేడు జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండో విడత డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ

-

పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో.. వాళ్లకూ సొంత గూడు కల్పించాలన్న ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా పేదలకు ఇళ్లను పంపిణీ చేస్తోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో ఇప్పటికే మొదటి విడతలో కొంత మందికి ఇళ్లు పంపిణీ చేసింది.

ఇక ఇవాళ జీహెచ్​ఎంసీ పరిధిలో రెండో విడత డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీకి ఉదయం 11 గంటలకు హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఆన్‌లైన్‌ డ్రా తీయనున్నారు. ఎన్​ఐసీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో మంత్రులు, ఉన్నతాధికారులు, లబ్దిదారుల సమక్షంలో డ్రా తీయనున్నారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

గత నెల 24 వ తేదీన మొదటి విడతలో 11 వేల700 మంది లబ్ధిదారులను ఇదే పద్ధతిలో ఎంపిక చేసి ఈ నెల 2 వ తేదీన 8 ప్రాంతాలలో వారికి ఇళ్లను అందించారు. ఇవాళ 13 వేల 300 ఇళ్లకు నిర్వహించే ఆన్‌లైన్ డ్రాలో ఎంపికైన లబ్ధిదారులకు 21 వ తేదీన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇళ్లను అందించనున్నారు. మరిన్ని విడతల్లో.. రెండు పడక గదుల ఎంపిక ప్రక్రియ కొనసాగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version