తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆందోళన కరమైన పరిస్థితులు ఉన్నాయని.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ వ్యాఖ్యలు చేసింది. అయితే, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలకు కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు.
కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే , దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని వివరించారు.
కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా….రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నాము..సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ కి ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చురకలు అంటించారు.
Choosing country’s infrastructure over central vista during pandemic, is what we demanded.
Choosing farmers, labourers, unemployed youth over focusing on wealth generation for a few is exactly what we have been fighting for.
Thank you for echoing the vision of CM KCR Garu. https://t.co/VCOIHKZkbT
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 26, 2023