HBD: మాస్ మహారాజా రవితేజ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఇవే..!

-

మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖతర్నాక్ డైలాగ్ డెలివరీతో విలన్స్ కి బలుపు చూపించే బెంగాల్ టైగర్.. ఇటీవల ధమాకా సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా అతిధి పాత్రలో నటించి సినిమాకే హైలెట్గా నిలిచాడు ఒకరకంగా చెప్పాలి అంటే రవితేజ వల్లే ఈ సినిమా సక్సెస్ అయ్యింది అనడంలో సందేహం లేదు. ఈరోజు మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి తెలియని కొన్ని రహస్యాలను మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం..

సినిమా ఇండస్ట్రీలో స్వశక్తిని నమ్ముకొని అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలతో తిరంగేట్రం చేసి తన మేనరిజంతో బడా డైరెక్టర్ల దృష్టిని ఆకట్టుకున్న మాస్ మహారాజా హీరోగా ఎదిగి ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈయన అసలు పేరు రవిశంకర్ రాజు భూపతి రాజు.. 1968 జనవరి 26వ తేదీన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించాడు.. రాజగోపాల్ రాజు , రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించిన ఈయన ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత కర్తవ్యం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సోలో హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీకోసం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి నంది స్పెషల్ జ్యూరీ అవార్డును సొంతం చేసుకున్నారు.

ఖడ్గం సినిమాతో మరో నంది అవార్డును అందుకున్నారు రవితేజ. సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తితోపాటు ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆస్తి మొత్తాన్ని తన భార్య పేరున రాసినట్టు సమాచారం. ఇప్పటికే రవితేజ కొడుకు కూడా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న రావణాసుర ఫస్ట్ గ్లింప్ ను కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version