గవర్నర్ ను గౌరవించాలన్న ఇంగితం కూడా కేసీఆర్ కు లేదని విమర్శలు చేశారు వైఎస్ షర్మిల. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పది. అలాంటి పవిత్రమైన రాజ్యాంగాన్ని కేసీఆర్ గౌరవించడం లేదు. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి, ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. గణతంత్ర వేడుకలు కూడా నిర్వహించకుండా నియంతలా ప్రవర్తిస్తున్నాడు. భారత రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తి దేశాన్ని ఏలుతాడట అంటూ విమర్శలు చేశారు షర్మిల.
రాష్ట్ర ప్రథమ పౌరురాలిని గౌరవించాలన్న ఇంగితం కూడా కేసీఆర్ కు లేదు. గవర్నర్ గారికి YSR తెలంగాణ పార్టీ సంఘీభావం ప్రకటిస్తుంది. రాజ్యాంగం వల్ల ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో ఇలాంటి దుర్ఘటన బాధాకరం. దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. డా. బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచింది. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు షర్మిల.