హైడ్రా, మూసీ బాధితుల EMIలు ఎవరు కడతారు ? – కవిత

-

 

హైడ్రా, మూసీ బాధితుల EMIలు ఎవరు కడతారు ? అంటూ కల్వకుంట్ల కవిత నిలదీశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. మేము మండలి లో అడిగిన ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇస్తోందని… నిన్న మూసీ విషయం లో సభను మంత్రి శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని ఆగ్రహించారు. ప్రపంచ బ్యాంకు ను మూసి కోసం డబ్బులు అడగలేదని శ్రీధర్ బాబు చెబుతున్నారని. సెప్టెంబర్ 2024 లో ప్రపంచబ్యాంకు ను మూసి కోసం ఋణం అడిగినట్టు నేను ఈ రోజు సాక్ష్యాదారాలు బయట పెడుతున్నానని పేర్కొన్నారు.

kavitha

డీపీఆర్ లేదని అసెంబ్లీ లో చెబుతారని ఆగ్రహించారు. ప్రపంచబ్యాంకు కు సెప్టెంబర్ 19 న ఇచ్చిన నివేదిక లో ప్రపంచ బ్యాంకు కు డి పి ఆర్ ఉందని చెబుతారని వివరించారు. ఎందుకు కోసం అబద్దం చెబుతున్నారు ..ఎవరి లాభం కోసం ఇదంతా చేస్తున్నారని నిలదీశారు. ప్రజలకు స్పష్టత ఇవ్వండి అంటూ కోరారు. ప్రపంచ బ్యాంకును కేసీఆర్ తెలంగాణ లో అడుగుపెట్టనివ్వలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు రెడ్ కార్పెట్ వేస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news