నిజామాబాద్ మైనర్‌ రేప్‌ కేసులో ట్విస్ట్‌..పోలీస్ స్టేషన్ లో నిందితుని ఆత్మహత్య?

-

 

నిజామాబాద్ మైనర్‌ రేప్‌ కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ లో నిందితుని ఆత్మహత్య జరిగినట్లు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో అత్యాచార నిందితుని మృతి కేసు మలుపు తిరిగింది. పోలీస్ స్టేషన్ లో నిందితుని ఆత్మహత్య జరిగినట్లు చెబుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా రెంజల్ మండలం ఓ గ్రామంలో మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడ్డాడు రత్నావత్ రెడ్యా.

crime

అయితే….ఈ తరుణంలోనే బాధిత బాలిక కుటుంబ సభ్యుల దాడి లో తీవ్రంగా గాయపడ్డాడు రత్నావత్ రెడ్యా. గ్రామస్తుల దాడిలో గాయపడి మృతి చెందాడని ప్రచారం కూడా సాగుతోంది. కానీ అది వాస్తవం కాదని కొందరు అంటున్నారు. గ్రామస్తుల దాడి అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందాడట. అనంతరం పోలీస్ స్టేషన్ లో నిందితున్ని విచారించారు పోలీసులు. అక్కడ ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడట నిందితుడు. పోలీస్ స్టేషన్ లో నిందితుడు మృతి చెందిన ఘటన పై విచారణకు ఆదేశించారు పోలీస్ ఉన్నతాధికారులు. మెదక్ జిల్లా తూఫ్రాన్ డి.ఎస్పీ వెంకట్ రెడ్డి ని విచారణ అధికారిగా నియామకం చేశారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news