మహిళా బిల్లుకోసం దీక్ష చేస్తా : ఎమ్మెల్సీ కవిత

-

పదేళ్లుగా పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మహిళా బిల్లు కోసం డిసెంబర్ లో ఢిల్లీలో మరోసారి దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ‘పార్లమెంట్ లో మహిళా MPలు 12 శాతమే ఉన్నారు.

మహిళా సర్పంచులు, ఎంపీటీసీ జడ్పీటీసీలుగా మిగిలిపోవాలా?’ అని ప్రశ్నించారు. మరోవైపు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేయడం వెనక వ్యూహం ఉందని తెలిపారు.రేఖా నాయక్‌ చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఖానాపూర్ అభ్యర్థి కులం విషయంలో ఎటువంటి ఇబ్బందీ లేదని చెప్పారు. అటు మైనంపల్లి వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి విషయంలో పార్టీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. పార్టీ నిర్ణయం కు నేను అయిన… ఎవరు అయిన కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు కవిత.

Read more RELATED
Recommended to you

Latest news