మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవికి ప్రతిశష్ఠాత్మక పద్మ విభూషణ్, తెలంగాణ ప్రజా సంస్కృతికి ప్రతీక చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డులు దక్కడం పట్ల బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది పద్మ అవార్డు అందుకున్న వారందరికి ఈ సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తరతరాలుగా తెలంగాణ జన జీవితాల్లో “భాగోతం” పేరుతో భాగమైన సాంస్కృతిక కళారూపం యక్షగానం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతికోద్యమంలో ఈ కళారూపం, కళాకారులు భాగమైన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పలు రంగాలకు చెందిన తెలంగాణ సృజన కారులు బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేణు ఆనంద్ చారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యలకు అభినందనలు తెలిపారు.
మరోవైపు వెంకయ్యనాయుడు, చిరంజీవికు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరికి ఫోన్ చేసి శుభాకాంక్షలు స్వయంగా అభినందించారు. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల వారందరికీ ఆయన విషెస్ చెప్పారు.