‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’ – మే’ డే సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మే’ డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.
ఉత్పత్తి, సేవారంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటూ విజయవంతంగా అమలవుతున్నదన్నారు. వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణ లో సంపద సృష్టి జరుగుతున్నదని, అది దేశాభివృద్ధికి దోహదపడుతున్నదని సీఎం అన్నారు.
నిరుద్యోగులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ కార్మికులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలిచి.. మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.