కరీంనగర్: సోమవారం జిల్లాలో పర్యటించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ముందుగా కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ పేటలో వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులకు ధైర్యం చెప్పారు. రైతులంతా ధైర్యంగా ఉండాలని.. బిజెపి అండగా ఉంటుందని తెలిపారు. గత నెలలో పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
ప్రకృతి విపత్తుల కింద తెలంగాణకు కేంద్రం కేటాయించిన 3 వేల కోట్లు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు. నిర్ణీత సమయంలో వరి కొనుగోలు కేంద్రాలను తెరిస్తే.. సగం మంది రైతులకు నష్టం జరగకపోయేదని పేర్కొన్నారు. కెసిఆర్ ఎవరి మాట వినే పరిస్థితులలో లేరని.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన దాఖలాలు లేవన్నారు. కెసిఆర్ మూర్ఖత్వ పాలనలో 4 ఏళ్లలో 70 వేల మంది రైతులు చనిపోయారని అన్నారు.