మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి, అలాగే ఉదయ్ కుమార్ ల సిబిఐ కస్టడీ నేటితో ముగిసింది. ఆరు రోజులపాటు వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకున్న సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించారు. హత్య కేసులో ఆధారాలు చెరిపివేత, ఆర్థిక లావాదేవీల అంశాలపై అధికారులు ప్రశ్నించారు.
అయితే నేటితో వీరి కస్టడీ ముగియడంతో పోలీసులు నాంపల్లి సిబిఐ కోర్టుకు తరలించారు. కాగా మరోసారి వారి కస్టడీని పొడిగించాలని కోరారు సిబిఐ అధికారులు. దీంతో నాంపల్లి సిబిఐ కోర్టు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ల జ్యుడీషియల్ రిమాండ్ ని పొడిగించింది. భాస్కర్ రెడ్డి కి ఈ నెల 29 వరకు, ఉదయ్ కుమార్ కి ఈనెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో వీరిద్దరిని అధికారులు చంచల్ కూడా జైలుకు తరలించారు.