కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కొనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సాంకేతికంగా సేకరించిన డేటాను ఎత్తుకెళ్లడం దొంగతనమేనంటూ విమర్శించారు. ప్రధాని మోదీ, కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
కెసిఆర్ కు లిక్కర్ అంటే చాలా ఇష్టమని.. అందుకే తెలంగాణలో లిక్కర్ ఆదాయం 36 వేల కోట్లకు తీసుకెళ్లారన్నారు. అందుకే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డి. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నంత మాత్రాన కేసీఆర్ డిఎన్ఏ మారదని.. అలాగే పార్టీ పేరు మారినంత మాత్రాన కేసీఆర్ మారినట్లు కాదన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి అంశాన్ని పార్లమెంటులో చర్చకు తీసుకొస్తామన్నారు.