గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేడు సమావేశం కానున్నారు. గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేయనున్న కేసీఆర్.. నవంబరు 9వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. శామీర్ పేట మండలం తూంకుంటలోని.. ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్‌లో గజ్వేల్ బీఆర్ఎస్ శ్రేణుల సమావేశం. జరగనుంది. నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యే ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొననున్నారు.
గజ్వేల్ అభ్యర్థిగా తూంకుంట నర్సారెడ్డిని కాంగ్రెస్ ప్రకటించగా… బీజేపీ నుంచి తాను పోటీ చేయనున్నట్లు ఈటల రాజేందర్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గజ్వేల్‌లో గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ సాధించి.. సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రణాళికలు చేస్తోంది. పార్టీలో చేరికలపై బీఆర్ఎస్ నాయకత్వం దృష్టి పెట్టింది. తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డితో… చర్చలు కొలిక్కివచ్చాయని సమాచారం. నేడో, రేపో గులాబీ కండువా కప్పుకుంటారని… బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్లో చేరనున్నారు.