మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రచారం చేయడంతో డబ్బుల ప్రవాహం కొనసాగుతోంది ఆ నియోజకవర్గంలో. అటు ఎన్నికల నియమాల ప్రకారం, ఇతర ప్రాంతాల నాయకులు అంతా మునుగోడును వదిలేశారు. రేపు మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది.
గురువారం పోలింగ్ జరగనున్న క్రమంలో పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నేతలు అందరూ నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఉండి మునుగోడు ఓటర్లతో టచ్ లో ఉండాలని, స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ ఉండాలని ఆదేశించారు. జిల్లా విడిచి వెళ్ళవద్దని నేతలు అప్పగించిన ప్రాంతంలోని ఓటర్ల ఫోన్ నంబర్లను సేకరించి వారితో మాట్లాడాలని సూచించారు. పోలింగ్ ముగిసే వరకు స్థానిక క్యాడర్, ఓటర్లతో టచ్ లో ఉండాలని, వాళ్లు వేరే పార్టీ వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని నేతలకు కేసీఆర్ తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు నల్గొండ విడిచి వేరే ప్రాంతానికి వెళ్లవద్దని ఆదేశించారు.