రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కు వ్యతిరేకంగా కేసీఆర్‌ సంచలన ప్రకటన

-

రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కు వ్యతిరేకంగా కేసీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా…తెలంగాణ రాష్ట్ర వ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.

KCR sensational announcement against Revanth Reddy Sarkar

తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.

పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version