బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని.. రాష్ట్రంలో ఎంపీ స్థానాల్లో బీజేపీ ని గెలిపిస్తానని మోడీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తోంది. ఇన్నాళ్లు తనను గుండెల్లో పెట్టుకున్న హూజూరాబాద్ ప్రజలు ఇప్పుడు ఎందుకు ఓడించారో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై విచారన జరపాలని అమిత్ షా ను ఈటల ఎందుకు కోరలేదు అని ప్రశ్నించారు.
కేటీఆర్ అవినీతి, ఫోన్ల ట్యాపింగ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు అన్నారు. మోడీ ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు ఈటల సిద్ధమేనా..? అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న మోడీ తెలంగాణకు చేసిందేమి లేదన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే.. అవి రద్దయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం చేసింది. సాగు చట్టాలు రద్దు చేసి.. ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పేలా చేసింది అన్నారు. రైతులు,కాంగ్రెస్ నేతలు.. ఓట్ల కోసం ఆయన మత విద్వేశాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. మతాలు, భాషల మధ్య చిచ్చుపెట్టి గెలవాలని బీజేపీ చూస్తోంది అన్నారు.