మల్కాజిగిరి నియోజకవర్గాన్ని తానెప్పుడూ మర్చిపోనని CM రేవంత్ తెలిపారు. శామీర్పేట సభలో మాట్లాడిన ఆయన..2018లో ఎన్నికల్లో కొండగల్‌లో నేను ఓడితే.. మల్కాజ్‌గిరి ప్రజలే నన్ను మళ్లీ ఎంపీగా గెలిపించి నిలబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.ఎంపీగా చేసిన పోరాటంతోనే PCC చీఫ్ పదవి వచ్చింది. పడిపోతున్న నన్ను ఇక్కడి ప్రజలే నిలబెట్టారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తెచ్చి.. నాకు అండగా నిలిచిన ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. సునీతా రెడ్డిని ఎంపీగా గెలిపించాలి’ అని రేవంత్ రెడ్డి కోరారు.
10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం చిన్నాభిన్నమైందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం రూ.లక్షల కోట్లను దొచుకుందని ఆరోపించారు . అదేవిధంగా రాముడి పేరు మీద బీజేపీ ఇంకెంత కాలం రాజకీయాలు చేస్తుందోనని మండిపడ్డారు. దేవుడు గుడిలో ఉండాలని.. భక్తి గుండెల్లో ఉండాలన్నారు. పట్నం సనీతారెడ్డి ముందుగా చేవెళ్లలో నిలబెట్టాలని అనుకున్నామని, అయితే, ప్రజా సమస్యలు తెలిసిన సునీతమ్మను తానే మల్కాజ్‌గిరిలో పోటీలో పెట్టాలని నిర్ణయించానని తెలిపారు.