బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల బీ ఫాంలపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో బిఅర్ఎస్ పార్టి అధినేత కేసీఆర్ కీలక సమావేశం ఉంది. ఈ సందర్భంగా లోక్ సభ లో పోటీ చేసే అభ్యర్థుల కు బి ఫార్మ్ లను అందించనున్నారు కేసీఆర్.
అలాగే.. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టాల్సిన కార్యచరణపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు బిఅర్ఎస్ పార్టి అధినేత కేసీఆర్. పోటి చేసే 17 మంది పార్టి అభ్యర్థులకు ఎన్నికల నియామావళీ ప్రకారం ఒక్కొక్క అభ్యర్థికి 95 లక్షల రూపాయల చెక్కులను అందజేయనున్నారు బిఅర్ఎస్ పార్టి అధినేత కేసీఆర్. ఈ సమావేశానికి ఎంపిలు,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు,మాజి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు,పార్టి కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు.