రైతులకు రేవంత్ శుభవార్త చెప్పినట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ధాన్యం కొనుగోలు అంశం ఉండే ఛాన్స్ ఉందట. కల్లాల్లో ఉన్న తడిసిన ధాన్యంతో సహా ప్రతి ధాన్యపు గింజను కొనాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందట.
ఇప్పటికే అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పిఎసిఎస్, ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నది తెలంగా రాష్ట్ర ప్రభుత్వం. శనివారం సాయంత్రం వరకు 6 లక్షల 11 వేల మంది రైతుల నుండి 36 లక్షల 50 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఆదివారం సాయంత్రం వరకు ధాన్యం కొనుగోలు వివరాలు ఈరోజు ప్రకటించనున్నారు సివిల్ సప్లై అధికారులు. ఇక ఇవాళ తడిసిన ధాన్యంపై ప్రకటన రానుందట.