Tamilnadu: ట్రోలింగ్‌ తట్టుకోలేక…ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య

-

Tamilnadu: ట్రోలింగ్‌ తట్టుకోలేక…ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియా ట్రోల్స్‌ కు మనస్తాపం చెంది ఐటి ఉద్యోగి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల ఏప్రిల్ 28న చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని నాల్గవ అంతస్తు బాల్కనీ నుండి తన బిడ్డ ప్రమాదవశాత్తూ ఆమె చేతుల్లోంచి జారి పడిపోయింది.

it employees died in tamilnadu

అయితే తల్లి(రమ్య)కు బిడ్డను సరిగ్గా చూసుకోవటం రాదని కొందరు స్థానికులు మరియు న్యూస్ ఛానల్స్ విమర్శించారు.. దీంతో అవమానాలు తట్టుకోలేక భర్త మరియు బిడ్డను తీసుకొని కోయంబత్తూర్ కరమడైలోని తన పుట్టింటికి వెళ్లింది. ఆ విమర్శలతో మనస్తాపం చెందిన తల్లి(రమ్య) ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో వాళ్లు ఇంటికి వచ్చేసరికి రమ్య స్పృహలో లేకపోవటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version