కళ్యాణ లక్ష్మి పథకంపై కెసిఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు. శాసనసభ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.
లగ్నపత్రిక పెట్టుకున్న రోజు కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకుంటే పెళ్లిరోజు కళ్యాణ మండపంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అనేకమంది పెళ్లి అయిన తర్వాత దరఖాస్తు చేసుకోవడం వల్ల వాటిని 15 రోజుల్లో పరిశీలించిన పిదప అర్హులకు అందజేస్తున్నామని వెల్లడించారు. ఎక్కడా లేని ఆర్థిక సహాయం అందజేతలో జాప్యం జరగడం లేదని ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 ఆదాయం, పట్టణాలలో రెండు లక్షల ఆదాయం ఉన్నవారికి మాత్రమే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నామని తెలిపారు.