తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వీఓఏల గౌరవవేతనం పెంపు

-

ఇందిరా క్రాంతి పథంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ లుగా పని చేస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  వీవోఏ గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వీవోఏలకు రూ. 3,900 గౌరవ వేతనం ఇస్తుండగా.. దానిని రూ. 5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అదనపు సాయం రూ. 3 వేలు కలిపి వీవోఏలు నెలకు రూ. 8 వేలు అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 17 వేలకు పైగా వీవోఏలకు లబ్ది చేకూరనుంది. 

ఇక, గత కొంతకాలంగా తమ గౌరవ వేతనం పెంచాలని, సెర్ప్ ఉద్యోగులుగా  గుర్తించి రూ. 26 వేలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని వీవోఏలు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 20 ఏళ్లుగా వీవోఏలుగా పనిచేస్తున్నప్పటికీ.. కేవలం రూ. 3,900 వేతనం ఇస్తూ.. 20 రకాల పనులు చేయిస్తున్నారని.. శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని వీవోఏలు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం వారికి వేతనం పెంచడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version