ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఉమ్మడి ఏపీలోని తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన అక్రమ మైనింగ్ పరిశీలన కేసును కోర్టు కొట్టివేసింది. ఓబులాపురం మైనింగ్ పై గతంలో టీడీపీ నేతలు చేపట్టిన ఆందోళనలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ఈ కేసు విచారణలో భాగంగా విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకు గురువారం తెలుగుదేశం పార్టీ నేతలు హాజరయ్యారు.మంత్రి అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, ఎర్రబెల్లి దయాకర్, చినరాజప్ప, ధూళిపాళ నరేంద్ర, నాగం జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. నాటి నిరసనల కారణంగా టీడీపీ నేతలపై నమోదైన కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది.దీంతో ఏళ్లుగా కోర్టుకు హాజరవుతున్న వారికి ఊరట లభించింది.